జగిత్యాల జిల్లా మున్సిపల్ ఎన్నికలకు అందరు సహకరించాలి – కలెక్టర్ సత్యప్రసాద్,అడిషనల్ ఎస్పీ శేషాద్రిని రెడ్డి.

తేది:27- 01- 2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.

జగిత్యాల జిల్లాలో 5 మున్సిపాలిటీలో నిర్వహించనున్న ఎన్నికలకు అధికారులు, రాజకీయ పార్టీలు, మీడియా మరియు ప్రజలు ఎన్నికలు సజావుగా సాగేలా సహకరించాలని తెలిపారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ:
జిల్లాలోని 5 మున్సిపాలిటీల పరిధిలోని 136 వార్డులకు ఎన్నికలు జరుగుతాయని తెలిపారు.
వివరాలు:
జగిత్యాల మున్సిపల్ – 50
ధర్మపురి – 15
రాయికల్ – 12
కోరుట్ల – 33
మెట్ పెల్లి – 26
ఇందుకుగాను మొత్తం 379 పోలింగ్ స్టేషన్ లు ఏర్పాటు చేశామని అలాగే అవసరం మేరకు పోలింగ్ సిబ్బంది మరియు పోలీస్ సిబ్బంది అందుబాటులో ఉన్నారని తెలిపారు.
జిల్లాలోని 5 మున్సిపాలిటీలో జరగబోయే రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికలకు అందరు సహకరించి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ కోరారు.
అడిషనల్ ఎస్పీ శేషాద్రిని రెడ్డి మాట్లాడుతూ:
రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికలకు అన్ని రకాలుగా పోలీస్ బందోబస్త్ చేశామని ఎన్నికలు విజయవంతం అయ్యేలా పోలీసు సిబ్బందికి అందరు సహకరించాలని కోరారు.
ఈ సమావేశంలో ఆర్డీవో మధుసూదన్, డిపిఆర్వో పి. నరేష్, కలెక్టరేట్ ఏవో హకిమ్, ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు మరియు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *