తేది:27-01-2026 సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం TSLAWNEWS రిపోర్టర్ ఫయాజ్ షరీఫ్.
సంగారెడ్డి జిల్లా: ఝరాసంగం మండలంలో జీర్లపల్లి గ్రామంలో ప్రతి ఒక్కరు రెండు మొక్కలు నాటాలని జీర్లపల్లి సర్పంచ్ అమరేశ్వరి శివమణి అన్నారు గణతంత్ర దినోత్సవం సందర్భంగా 1000 వేయి హైబ్రిడ్ మామిడి మొక్కలను ఉచితంగా పంపిణీ చేశారు సర్పంచ్ మాట్లాడుతూ పర్యావరణం అంటే మన చుట్టూ ఉన్న గాలి, నీరు, భూమి, మొక్కలు, జంతువులు వంటి జీవ మరియు నిర్జీవ అంశాలన్నీ కలిసిన ప్రకృతి; ఇది మానవ మనుగడకు ఆధారం, స్వచ్ఛమైన గాలి, నీరు, ఆహారం, ఆశ్రయం వంటి అవసరాలను అందిస్తుంది, దీనిని కాపాడుకోవడం మనందరి బాధ్యత పర్యావరణ o బాగుంటే ఊరు బాగుంటుంది.ఈ కార్య క్రమంలో ఉప సర్పంచ్ రాజ శేఖర్ వార్డు సభ్యులు భరత్, లలిత, సంగీత, సుజాత,ఆశీర్వాదం మరియు నాయకులు వెంకట్ రెడ్డి మధుసూదన్ రెడ్డి, జాకిర్ హుసేన్, అనీఫ్,కిష్టయ్య, రాం చందర్, బుచ్చయ్య,పాల్గొన్నారు.