తేది:27- 01- 2026 TSLAWNEWS మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ పారువెల్లి దుర్గ భవాని.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా:పర్యావరణ పరిరక్షణ రంగంలో లయన్ అన్నెం కోటి రెడ్డి అందించిన విశేష సేవలకు గాను “ నరేంద్ర మోదీ విజన్ ఆఫ్ భారత్” అవార్డును అందుకున్నారు. మనం ఫౌండేషన్ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవం–2026 సందర్భంగా హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లోని వాసవి శ్రీ ముఖిగ్రాండ్‌లో ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డు ప్రదానం జరిగింది.
ప్రముఖ సినీ దర్శకులు, సాహితీ వేత్త, మూడుసార్లు నంది అవార్డు గ్రహీత అయిన శ్రీ రేలంగి నర్సింహారావు లయన్ అన్నెం కోటిరెడ్డి కి అవార్డు మరియు సర్టిఫికెట్‌ను తమ కరకములచే అందజేశారు.
పర్యావరణ సంరక్షణ, పచ్చదనం పెంపొందించడం, ప్రజల్లో అవగాహన కల్పించడం వంటి అంశాల్లో ఆయన చేసిన సేవలు అభినందనీయమని వక్తలు కొనియాడారు. ఈ సందర్భంగా అవార్డును అందించిన మనం ఫౌండేషన్ చైర్మన్ చక్రవర్తి గారికి లయన్ అన్నెం కోటిరెడ్డి గారు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో దుర్గాభవాని(జర్నలిస్టు), సావిత్రి, సినీ నటులు జెన్నీ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.