తేది: 27-01-2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా రాచమల్ల సుభాష్ రిపోర్టర్.
జగిత్యాల జిల్లా: రాయికల్ మండల్ లోని అల్లిపూర్ గ్రామానికి చెందిన పడాల గంగారెడ్డి సౌదీ అరేబియా నుండి ఇంటికి వచ్చి తిరిగి సౌది చేరిన 16వ రోజున గుండెపోటుతో మృతి చెందాడు. చనిపోయి 21 రోజు గడిచిన అక్కడ ఉన్న గవర్నమెంట్ నిర్లక్ష్యం వల్ల మృతదేహం ఇండియాకు రాలేదు . 21 రోజుల నుండి భార్య పిల్లలు తిండి లేకుండ అర్ధనాదాలు పెట్టి ఏడవటం వల్ల ఆరోగ్యం క్షీణించింది,ఎప్పుడు మృతదేహం వస్తుందో అని 21 రోజులుగా ఎదురు చూశారు, చివరకు ఇంటికి చేరినది. భార్య పిల్లలు అనారోగ్యానికి గురి అయ్యి బాధపడుతున్నారు, ఆర్థిక పరిస్థితులు క్షీణించాయి. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు అనాధలుగా మారారు. వారిని ఇక్కడ ఉన్న ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు ప్రభుత్వం వారిని కోరుకుంటున్నారు.