తేది:27- 01- 2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.
జగిత్యాల జిల్లా: మంగళవారం కలెక్టరేట్ లో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మేడారం మహా జాతర పోస్టర్ ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్.
సమ్మక్క, సారలమ్మ వన దేవతల మేడారం మహా జాతర జనవరి 28 నుండి 31 వరకు జరగనున్న నేపథ్యంలో దర్శనాలకు వచ్చే ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు.జిల్లా నుండి ఆర్.టి.సి బస్ లు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
వన దేవతల దర్శనాలకు వెళ్లే భక్తులు జాగ్రత్తగా వెళ్లి భక్తి శ్రద్ధలతో దేవతల కృప పొందాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ అధికారి కె. రాజ్ కుమార్, మరియు తదితరులు పాల్గొన్నారు.