తేది:26- 01- 2026 TSLAWNEWS హైదరాబాద్ ఇంచార్జ్ విజయ్ మురళీకృష్ణ.
హైదరాబాద్: హిమాయత్ నగర్ లోని ఎస్ ఎం ఈ వాసవి గ్రాండ్ శ్రీముఖి కాంప్లెక్స్ లో మనమ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భారతదేశ 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నితి ఆయోగ్, భారత ప్రభుత్వ అనుమతి పొందిన మనమ్ ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని “స్వర్ణిమ్ భారత్ – విరాసత్ ఔర్ వికాస్ అనే అంశంతో నిర్వహించింది.
ఈ సందర్భంగా దేశభక్తిని ప్రతిబింబించే ప్రసంగాలు, సమాజ సేవలో విశేష కృషి చేసిన వ్యక్తుల సత్కార కార్యక్రమాలు నిర్వహించారు. గణతంత్ర దినోత్సవం మనకు ఇచ్చిన స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం విలువలను మరింత బలపరిచే రోజు అని వక్తలు పేర్కొన్నారు.
ఈ వేడుకలకు చీఫ్ గెస్ట్‌గా ఆమె హాజరయ్యారు. ఆమె లైఫ్, హెల్త్ అండ్ జెనరల్ ఇన్సూరెన్స్ సీనియర్ ఫైనాన్షియల్ అనలిస్ట్, పత్రిక ప్రతినిధి గా, హ్యూమన్ రైట్స్ & కన్స్యూమర్ రైట్స్ ఉమెన్స్ వింగ్ సభ్యురాలు, అలాగే శ్రీ వారాహి వెల్త్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మేనేజింగ్ పార్ట్నర్గా అనేక రంగాల్లో సేవలు అందిస్తున్నారు.
అలాగే సమాజానికి చేసిన విశిష్ట సేవలకు గాను డా. పారువెల్లి అంకా విజయ దుర్గ భవాని గారికి “ఇండియన్ ఐకాన్ నేషనల్ అవార్డ్ – 2026” ను మనమ్ ఫౌండేషన్ ప్రదానం చేసింది. ఈ అవార్డు ఆమె చేసిన ఆర్థిక అవగాహన కార్యక్రమాలు, మహిళా సాధికారత, మానవ హక్కులు మరియు వినియోగదారుల హక్కుల పరిరక్షణలో చేసిన కృషికి గుర్తింపుగా అందజేశారు.
ఈ కార్యక్రమం దేశ అభివృద్ధి పట్ల ప్రతి పౌరుడిలో బాధ్యతను పెంపొందించేలా సాగిందని నిర్వాహకులు తెలిపారు. చివరగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో కార్యక్రమం ముగిసింది.