తేది:26-01-2026 TSLAWNEWS మెదక్ జిల్లా పాపన్నపేట మండల్ రిపోర్టర్.జె.దేవచిత్తము.
మెదక్ జిల్లా: పాపన్నపేట మండలం పరిధిలోని నాగ్సన్ పల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నేడు 77 వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలోముఖ్యఅతిథిగా విచ్చేసిన గ్రామ సర్పంచ్ శ్రీమతి దండం సుశీల గారు మాట్లాడుతూ రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరు పాటించాలని ఆమె సూచించారు. విద్యార్థులు ప్రతిరోజు బడికి హాజరై చక్కగా చదువుకొని మంచి ఫలితాలు సాధించాలని అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ శ్రీమతి పోలబోయిన చంద్రమ్మ గారు తెలిపారు. ఉప సర్పంచ్ మహమ్మద్ సిరాజుద్దీన్ మాట్లాడుతూ మౌలిక సదుపాయాల కృషికి ప్రభుత్వ సహకారంతో పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రధానోపాధ్యాయులు నజీరుద్దీన్, గ్రామ సర్పంచ్ దండెం సుశీల, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ పోలబోయిన చంద్రమ్మ,ఉప సర్పంచ్ మహమ్మద్ సిరాజుద్దీన్, మహిపాల్ రెడ్డి,ఇంద్రసేనారెడ్డి, జగదీశ్వర్ దేవచిత్తం, సామెల్, విజయ, వార్డు సభ్యులు అమ్మదర్శ పాఠశాల కమిటీ సభ్యులు, పంచాయతీ సెక్రెటరీ,ఉపాధ్యాయులు యువజన సంఘాల సభ్యులు,, గ్రామ పుర ప్రముఖులు,గ్రామ ప్రజలు విద్యార్థులు పాల్గొన్నారు.