తేది:26-01-2026 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS ఇశ్రతాబాద్ గ్రామ రిపోర్టర్ M రాజ్ కుమార్.
సంగారెడ్డి జిల్లా: సదాశివపేట మండలం లోని ఇశ్రతాబాద్ గ్రామంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద మరియు స్థానిక ప్రాథమిక పాఠశాల ఆవరణంలో జెండా ఎగురవేయడం జరిగింది అనంతరం జరిగిన గ్రామసభలో వక్తలు మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ విశేషాలను మహనీయుల త్యాగాల గురించి మాట్లాడుతూ యువత సన్మార్గంలో ఐకమత్యంతో నడిస్తే దేశ భవిష్యత్తు అభివృద్ది పథంలో ముందుకు కొనసాగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ సెక్రటరీ మాట్లాడుతూ మేరే గావ్ మేరే దరోహర్ అనే ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా గ్రామానికి సంబంధించిన వివరాలు అంతర్జాలంలో పొందుపర్చేందుకు గ్రామ విశేషాలను గ్రామ పెద్దలను అడిగి తెలుసుకోవడం జరిగింది గ్రామ సర్పంచ్ అనిత శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్చి నూతనంగా తీసుకువస్తున్న వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గర్ అజీవిక మిషన్ గ్రామీణ్ పథకంలో చాలా లోపాలు ఉన్నాయని దీనిని ముక్తకంఠంతో వ్యతిరేకిస్తూ నిరసన తెలియజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బలరాం అనిత, శ్రీనివాస్,ఉప సర్పంచ్ కె శ్రీనివాస్ వార్డు సభ్యులు రషీద్, సయ్యద్ ఇర్ఫాన్, బలరాం రాములు, రౌఫ్, బలరాం నాగమణి, బలరాం అనసూయ , షాహిన్ బేగం, అంగన్వాడీ ఉపాధ్యాయురాలు ఈశ్వరమ్మ, గ్రామ సమాఖ్య అధ్యక్షురాలు అమృత, పాఠశాల ఉపాధ్యాయులు యూసుఫ్,ఏకానందం, గ్రామ పెద్దలు యువకులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది.