తేది:26-01-2026 మెదక్ జిల్లా TSLAWNEWS అల్లాదుర్గం మండల్ రిపోర్టర్ వి పాపయ్య చారి.
మెదక్ జిల్లా : అల్లాదుర్గం మండల వ్యాప్తంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఆయా గ్రామాలలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామ పంచాయతీల వద్ద గ్రామ కార్యదర్శులు జాతీయ జెండాను ఎగరవేశారు. సబ్ డివిజన్ కేంద్రమైన అల్లాదుర్గంలో ని జూనియర్ సివిల్ కోర్టులో న్యాయమూర్తి సౌజన్య, తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ మల్లయ్య, పంచాయతీరాజ్ ఉప కార్యాలయం వద్ద డి. ఈ ప్రభాకర్, ఎంపీడీవో కార్యాలయం లో ఎంపీడీవో వేద ప్రకాష్ రెడ్డి, స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్సై శంకర్, సిఐ కార్యాలయంలో శంకర్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ సారిక, ఐకెపి లో ఏపీఎం రుక్మిణి, ఈజీఎస్ వద్ద ఏపీవో సుధాకర్, జెడ్పిహెచ్ఎస్ ఉన్నత బాలుర పాఠశాలలో హెచ్ఎం పిచ్చయ్య, బాలికలు ఉన్నత పాఠశాలలో హెచ్ఎం స్వప్న, ప్రాథమిక పాఠశాలలో హెచ్ఎం నాగరాజు, కళాశాలలో ఇన్చార్జి ప్రిన్సిపాల్ తుకారం, కస్తూర్బా గాంధీ పాఠశాలలో ఎస్ ఓ స్రవంతి, ముదిరాజ్ సంఘం వద్ద అధ్యక్షులు రాములు, వీటితోపాటు గ్రామాలలో ప్రజలు గణతంత్ర వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు.