భారత్‌లో అతిపెద్ద ఐఫోన్ అసెంబ్లీ ప్లాంట్ ఏర్పాటుకు టాటా గ్రూప్ సన్నాహాలు చేపట్టింది. తమిళనాడులోని హోసూర్‌లో భారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ ప్లాంట్ ద్వారా రెండేళ్లలో50 వేల ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని బ్లూంబర్గ్ రిపోర్ట్ ప్రకటించింది. 12 నుంచి 18 నెలల్లోగా కార్యకలాపాలు చేపట్టే విధంగా టాటా గ్రూప్ కసరత్తు చేస్తోంది.