


తేది:26-01-2026 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS సదాశివపేట రిపోర్టర్ కృష్ణ.
సంగారెడ్డి జిల్లా, సదాశివపేట పట్టణంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని గాంధీ చౌక్ వద్ద ఉదయం 7:55 నిమిషములకు స్వాతంత్ర సమరయోధుల ఉత్తరాధికారుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో, సదాశివపేట పట్టణ మున్సిపాలిటీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో, సదాశివపేట పట్టణ తహసిల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో మరియు సదాశివపేట తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ స్కూల్ లో ఏర్పాటుచేసిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్. జనవరి 26 గణతంత్ర దినోత్సవ వేడుకలను పునస్కరించుకొని న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం అనేది కులమతాలకు అతీతంగా అందరూ కలిసి ఐకమత్యాన్ని చాటుతూ జరుపుకునే ఒక జాతీయ పండుగ అని తెలియజేస్తూ స్వాతంత్రం సాధించుకున్న తర్వాత పరిపాలన విధానాన్ని చట్టబద్ధతతో ప్రణాళిక బద్ధంగా ఏర్పాటుచేసిన రాజ్యాంగ అవతరణ దినోత్సవం గణతంత్ర దినోత్సవం గా జరుపుకుంటామని ఇట్టి వేడుకలకు హాజరైన నాయకులకు, మాజీ ప్రజా ప్రతినిధులకు, ప్రభుత్వ ఉద్యోగులకు, తాసిల్దార్ కార్యాలయ సిబ్బందికి, ఫ్రీడమ్ ఫైటర్స్ వారసులకు, మైనారిటీస్ రెసిడెన్షియల్ స్కూల్ సిబ్బందికి మరియు పట్టణ ప్రజలకు అందరికీ పేరుపేరునా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా పలుచోట 77వ గణతంత్ర దినోత్సవంను ఉద్దేశించి పలువురిని చైతన్య పరుస్తూ ప్రసంగించారు. ఇట్టి సందర్భంలో మైనారిటీస్ రెసిడెన్షియల్ స్కూల్ సిబ్బంది మర్యాదపూర్వకంగా న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ గారికి శాలువాతో ఘనంగా సన్మానించారు. అదేవిధంగా తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ స్కూల్లో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరిపిన ప్రధానోపాధ్యాయులకు మరియు ఉపాధ్యాయ బృందానికి, విద్యార్థినీ విద్యార్థులకు పేరుపేరునా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. అదేవిధంగా సదాశివపేట పట్టణ తహసిల్దార్ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఉద్దేశించి తహసిల్దార్ గారు మాట్లాడారు. ఈ యొక్క 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను సంగారెడ్డి జిల్లాలో ని ప్రజలు, ఉద్యోగస్తులు, విద్యార్థిని విద్యార్థులు, ఫ్రీడమ్ ఫైటర్ వారసులు మరియు మహిళ సంఘాల వారు అధిక సంఖ్యలో పాల్గొని ఘనంగా జరుపుకున్నారు.