తేది:25-01-2026 TSLAWNEWS హైదరాబాద్ జిల్లా ఇంచార్జ్ విజయ్ మురళీకృష్ణ.
హైదరాబాద్: కూకట్‌పల్లి లోని ఎటిసి హోటల్‌లో దుర్గ భవానీ ఆధ్వర్యంలో లైఫ్ ఇన్సూరెన్స్ తరపున బ్యాగులు మరియు 2026 సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రతి కుటుంబానికి భవిష్యత్ భద్రత అత్యంత అవసరమని, జీవిత బీమా అనేది కేవలం పెట్టుబడిగా మాత్రమే కాకుండా కుటుంబానికి రక్షణ కవచంగా నిలుస్తుందని తెలిపారు. ప్రజల్లో బీమా, ఆర్థిక అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు.
ఆమె లైఫ్,హెల్త్ అండ్ జెనరల్ ఇన్సూరెన్స్ సీనియర్ ఫైనాన్సియల్ కన్సల్టెంట్ గా,హ్యూమన్ రైట్స్, కన్స్యూమర్ రైట్స్ కార్యకర్తగా, పత్రిక ప్రతినిధిగా, అలాగే సైబర్ సురక్ష సోల్జర్‌గా సమాజ సేవలో చురుకుగా పనిచేస్తున్నారని ఈ సందర్భంగా పలువురు ప్రశంసించారు. అదేవిధంగా శ్రీ వారాహి వెల్త్ అండ్ ఫైనాన్సియల్ సర్వీస్ ద్వారా ఎంతో మందికి పార్ట్ టైమ్, ఫుల్ టైమ్ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ, ఆర్థికంగా ఎదగడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, బీమా సలహాదారులు, వినియోగదారులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.