తేది:25-1-2026 TSLAWNEWS మెదక్ జిల్లా, మెదక్ మండలం రిపోర్టర్ శివలింగం ఎల్లం.
మెదక్ జిల్లా : కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత్ రావు గారి ఆధ్వర్యంలో ప్రజల మనిషి ప్రజా బంధావుడు చింతల నర్సింలు గారి తనయుడు కాంగ్రెస్ పార్టీకండువా కప్పుకున్నారు ఈ సందర్బంగా దిలీప్ ముదిరాజ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు ఆకర్షితులను అయ్యానని ఆయన తెలిపారు. నాకు రాజకీయంగా ప్రోత్సాహం ఇచ్చిన మైనంపల్లి హనుమంతరావు గారు అలాగే మా తండ్రి ప్రజానాయకుడు చింతల నర్సింలు గారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియ జేశారు. ప్రజాసేవలో ఉండాలని సంకల్పంతో కాంగ్రెస్ పార్టీలో చేరానని ఆయన తెలియజేశారు, రాష్ట్రంలో ప్రజలకు సంక్షేమ పథకాలు బాగున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని చెప్పారు. పది సంవత్సరాలు పాలించిన టిఆర్ఎస్ పార్టీ అవినీతి పార్టీ అయిందని విమర్శించారు. దోచుకో దాచుకో అన్నట్లు టిఆర్ఎస్ నాయకులు వివరించారని మండిపడ్డారు. బల్దియా ఎన్నికల్లో మెదక్ మున్సిపల్ పై ఎగిరేది కాంగ్రెస్ జెండానే అని తెలియజేశారు.