తేది:25-01-2026 నల్గొండ జిల్లా TSLAWNEWS నల్గొండ టౌన్ రిపోర్టర్ చిరుమర్తి భరత్ కుమార్.
నల్గొండ జిల్లా: శాలిగౌరారం మండలం, ఆకారం గ్రామం, జనవరి 25 న తొమ్మిదో శతాబ్దం నాటి సూర్య దేవాలయంలో నల్గొండ పట్టణ షేర్ బంగ్లా పాత బస్తి లోని ఆర్య సమాజ్ మందిరం మరియు బ్రహ్మంగారి గుట్ట కమిటీ సభ్యులతో కలిసి ఆకారం గ్రామంలోని సూర్య దేవాలయంలో ఘనంగా పూజలు చేసి ఆ దేవాలయంలో జరిపిన యజ్ఞంలో ఆ ఊరు గ్రామ ప్రజలు మరియు చుట్టుపక్కల ప్రజలు పాల్గొనడం జరిగింది అంగరంగ వైభవంగా జరిగిన ఈ యొక్క దేవాలయం పూజలు రథసప్తమి రోజున జరగడం విశిష్టతగా నిలిచింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు గుడి నిర్మాణం కోసం పాటుపడతామని మన సనాతన హిందూ ధర్మాన్ని కాపాడుకుందాం అని మన పైన మన సంస్కృతి పైన మన దేవాలయాల పైన జరిగిన దాడులను మరోమారు గుర్తు చేసుకుంటూ మళ్లీ ఇలాంటి మన పునరావృతం కాకుండా ఉండాలంటే హిందూ మతం కలిసికట్టుగా ముందుకు సాగాలని మనం హిందూ మతంలోనే ఉండి మన మతాన్ని మన కాపాడుకొని మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో , కానుగుల స్వామి, బొలుగూరియాదగిరి,కొత్తపల్లి రాములు,ఆర్డిఓ అశోక్ రెడ్డి, నటరాజ్ ,సతీష్ ,వెంకటేశ్వర్లు , సురేష్,రమ్య, ఓమేశ్వర్, నాగేశ్వరి, జ్యోతి శ్రీ తదితరులు పాల్గొన్నారు