కేంద్ర ప్రభుత్వం Medal for Meritorious Service (MSM) మెడల్‌ కు ASI ఆనందం ఎంపిక – అభినందించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్.

తేది:25- 01- 2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.

జగిత్యాల జిల్లా: పోలీస్ శాఖకు చెందిన స్పెషల్ బ్రాంచ్ ASI ఆనందం, కేంద్ర ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన Medal for Meritorious Service (MSM) మెడల్‌ కు ఎంపిక కావడం గర్వకారణమని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ తెలిపారు.
విధి నిర్వహణలో భాగంగా నిబద్ధతతో, కష్టపడి పనిచేసే పోలీస్ అధికారులకు ఇలాంటి గుర్తింపు లభించడం ఇతర సిబ్బందికి ప్రేరణగా నిలుస్తుందని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 12 మంది పోలీస్ అధికారులకు MSM మెడల్ లభించగా, అందులో జగిత్యాల జిల్లా నుంచి ASI ఆనందం ఎంపిక కావడం అభినందనీయమని అన్నారు.
ASI ఆనందం 1989 సంవత్సరంలో కానిస్టేబుల్‌గా పోలీస్ శాఖలో చేరి, 2012లో హెడ్ కానిస్టేబుల్‌గా, 2020లో ASIగా పదోన్నతి పొందారు. తన సుదీర్ఘ సేవా కాలంలో 2012లో రాష్ట్ర పోలీస్ సేవా పథకం, అలాగే 2018లో ఉత్తమ సేవా పథకం కు ఎంపికయ్యారు.
37 సంవత్సరాల పాటు ఎలాంటి రిమార్క్లే కుండా,అంకితభావంతో పోలీస్ శాఖకు చేసిన విశేష సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిష్ఠాత్మక Medal for Meritorious Service (MSM) మెడల్‌కు ఎంపిక చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.
ఈ సందర్భంగా ASI ఆనందంను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించి, భవిష్యత్తులో మరింత ఉత్తమ సేవలు అందించాలని ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *