తేది:25-01-2026 TSLAWNEWS మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తోట అభిలాష్.
మెదక్ జిల్లా: BRS పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే శ్రీ పద్మ దేవేందర్ రెడ్డి గారి చోరవతో, 19వ వార్డు మాజీ కౌన్సిలర్ శ్రీ వంజరి రాజు గారి ఆధ్వర్యంలో, మెదక్ CSI చర్చి ప్రిస్బైటర్ ఇన్చార్జ్ రెవ. శాంతయ్య గారి సమక్షంలో చర్చికి అవసరమైన ఫ్రీజర్ను దానంగా అందజేశారు.
ఈ సందర్భంగా రెవ. శాంతయ్య గారు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, చర్చి అవసరాలను గుర్తించి సహకారం అందించిన మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి గారికి మరియు వంజరి రాజు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం మతసామరస్యానికి, సేవాభావానికి ప్రతీకగా నిలిచిందని పలువురు అభిప్రాయపడ్డారు.
ఈ సేవా కార్యక్రమంలో లాజర్, మస్కూరి వెంకట్, మధు, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. చర్చికి అందించిన ఈ సహాయం స్థానిక ప్రజలు అభినందించారు.