తేది:24-01-2026 నల్లగొండ జిల్లా TSLAWNEWS దేవరకొండ నియోజకవర్గం పులిజాల గోవర్ధన్.
నల్గొండ జిల్లా: స్థానిక మునగాల కొండలరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్)లో ఎన్ఎస్ఎస్ (NSS) యూనిట్ I & II ఆధ్వర్యంలో జాతీయ ఓటరు దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులతో కలిసి పట్టణంలో భారీ ర్యాలీని చేపట్టారు.ర్యాలీ అనంతరం కళాశాల ఆవరణలో విద్యార్థులు, అధ్యాపకులు మరియు అధ్యాపకేతర సిబ్బంది అందరూ కలిసి ఓటరు ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపాల్ జి. కోటయ్య మాట్లాడుతూ, “ఓటు అనేది మన చేతిలో ఉండే అత్యంత పదునైన ఆయుధం. సమాజంలో మార్పు తీసుకురావడం కేవలం ఓటు ద్వారానే సాధ్యమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ నిజాయితీగా, అభివృద్ధిని కాంక్షించే వారికి ఓటు వేసి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలి” అని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కళాశాల అకాడమిక్ కోఆర్డినేటర్ సి. లింగమయ్య, ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ డాక్టర్ వి. మకట్లాల్, కళాశాల అధ్యాపక బృందం, సిబ్బంది మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.