తేది:24-01-2026 ఖమ్మం జిల్లా TSLAWNEWS వేంసూరు మండలం రిపోర్టర్. మహమ్మద్ బురహానుద్దీన్.
ఖమ్మం జిల్లా: సత్తుపల్లి పట్టణంలోని వెంగళరావు నగర్ కాలనీలో రోడ్డు నెంబర్ 9లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు వర్క్ కుటి సుధాకర్ భాగ్యలక్ష్మి దంపతుల నూతన గృహప్రవేశ కార్యక్రమంలో సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యురాలు డాక్టర్ మట్టారాకమైన విజయ్ కుమార్ ముఖ్యఅతిథిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రిబ్బన్ కట్ చేసి నూతన గృహా న్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే మట్టారాగమై దయానంద్ మాట్లాడుతూ పేదవాడి సొంతింటి కల సహకారం దిశగా అడుగులు వేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు ఉపముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క గారికి జిల్లా మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరియు తుమ్మల నాగేశ్వరావు గార్లకు ప్రజలందరి తరఫున ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని ఆమె అన్నారు. సత్తుపల్లి మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డులలో కలిపి సుమారు 700 ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకో బోతున్నామని ఎమ్మెల్యే తెలిపారు. అర్హులైన ప్రతి పేదవాడికి ఇంద్రమ్మ ఇల్లు అందే లా చూస్తామని ఆమె హామీఇచ్చారు. గతంలో ఎన్నడు లేని విధంగా సత్తుపల్లి మరియు కల్లూరు మున్సిపాలిటీలను అన్ని రంగాలు అభివృద్ధి చేస్తామని, మౌలిక సదుపాయాల కల్పనలో రాజీ పడబోమని ఆమె స్పష్టం చేశారు. నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు మరియు వార్డు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.