తేది:24-01-2026 మెదక్ జిల్లా TSLAWNEWS అల్లాదుర్గం మండల్ రిపోర్టర్ వి పాపయ్య చారి.
మెదక్ జిల్లా: అల్లాదుర్గంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో కొన్యాల బేతయ్య శివ స్వామి, వాణి దంపతులు పడిపూజ కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు. దీనికి వివిధ గ్రామాల నుండి శివ స్వాములు భారీ సంఖ్యలో తరలివచ్చారు. గురు స్వామి సదానందం స్వామి ఆధ్వర్యంలో పడిపూజ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. సందర్భంగా గణపతి పూజ, రుద్రాభిషేకం, సహస్ర నామావళి, శివ స్తోత్రం, పుష్పార్చన, హారతి, భజన కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. శివనామస్మరణతో వెంకటేశ్వర ఆలయ ప్రాంగణం మార్మోగింది. స్వాములకు,భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో అల్లాదుర్గం అసెంబ్లీ సాధన కమిటీ అధ్యక్షులు బ్రహ్మం, ప్రవీణ్, శివ మూర్తి, తదితరులు పాల్గొన్నారు.