తేది:24-01-2026 TSLAWNEWS మెదక్ జిల్లా మెదక్ మండలం రిపోర్టర్ శివలింగం ఎల్లం.
మెదక్ జిల్లా: మెదక్ పట్టణానికి చెందిన పెరుక ఎట్టమ్మ కుమారుడు, డయాలసిస్ బాధపడుతున్న పేషేంట్ పెరుక సతీష్ ఇటీవలే జారీ క్రింద పడిపోవడంతో రెండు కాళ్ళు విరుగిపొయ్యాయిఈ విషయం తెలుసుకున్న టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మెదక్ నియోజకవర్గం ఇంచార్జ్ కంఠ రెడ్డి తిరుపతిరెడ్డి వెంటనే స్పందించి ఒక కాలుకి ప్రైవేట్ హాస్పిటల్ లో సర్జరీ సుమారు 50000 అవుతున్నాయని కుటుంబ సభ్యులు తెలపడంతో స్థానిక నాయకుల ద్వారా 10000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మీ కుటుంబానికి అండగా ఉంటా,ఆదుకుంటామని తెలియజేసారు ,బాధిత కుటుంబసభ్యులు మాట్లాడుతూ తిరుపతిరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాడురి చంద్రమోహన్ గౌడ్,సున్నం నరేష్,సంఘ శ్రీకాంత్,శ్యామసుందర్,గౌస్ తదితరులు పాల్గొన్నారు.