రేవంత్ రెడ్డికి శుభాకాంక్షులు తెలిపిన మోదీ, రాహుల్ గాంధీ, హరీష్ రావు, చిరంజీవి..

తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షులు తెలిపారు. ట్విట్టర్ ఎక్స్ వేదికగా ఆయన శుభాకాంక్షులు తెలుపుతూ.. తెలంగాణ అభివృద్ధికి తాము అన్ని విధాలుగా సహకరిస్తామని చెప్పారు.

 

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిజేశారు. నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు, మంత్రులందరికీ నా శుభాకాంక్షలు. ట్విట్టర్‌లో ఆయన శుభాకాంక్షలు తెలుపుతూ.. తెలంగాణలో ఇప్పుడే ప్రజల సర్కార్ ప్రారంభమైంది. అందరూ కలలుగన్న బంగారు తెలంగాణ మేము సాధిస్తాము.. ఇచ్చిన ఆరు గ్యారింటీలను పూర్తి చేస్తామని చెప్పుకొచ్చారు.

 

అలాగే సిఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, బిఆర్ఎస్ అగ్రనేత హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపారు. రేవంత్ రెడ్డితోపాటు ఉపముఖ్యమంత్రి మల్లు భత్తి విక్రమార్కకు హరీష్ రావు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు.

 

‘‘ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఎనుముల రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన మల్లు భట్టి విక్రమార్కకి, అలాగే మంత్రులుగా ప్రమాణం చేసిన వారందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. తెలంగాణ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పని చేయాలని ఆకాంక్షిస్తున్నాను’’ అని హరీష్‌రావు ట్వీట్ చేశారు.

 

 

రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులలో నటుడు మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు. ట్విట్టర్ ఎక్స్‌లో ఆయన ట్వీట్ చేస్తూ.. తెలంగాణ నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్కతో పాటు.. మంత్రులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ నాయకత్వంలో మన రాష్ట్రం ఉన్నత స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నాను.. అని రాశారు.

 

రేవంత్ రెడ్డికి తెలుగుదేశం నేషనల్ జెనెరల్ సెక్రటరీ నారా లొకేష్ శుభాకాంక్షలు తెలిపారు. ‘తెలంగాణ ముఖ్మమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు మీ పాలనా పదవీ కాలం విజయవంతం కావాలని కోరుకుంటున్నాను’ అని ఆయన ట్వీట్ చేశారు.

 

 

ముఖ్యమంత్రిగా ప్రమాన స్వీకారం చేస్తున్న సందర్భంలో ఆంధ్రప్రదేశ్‌లో రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఫ్లెక్సీలు, బ్యానర్లు వెలిశాయి. రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం నేపథ్యంలో నందిగామ, వీరులపాడులో బ్యానర్లు వెలిశాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *