తేది:24- 01- 2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి
జగిత్యాల జిల్లా: శనివారం జగిత్యాల జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జనవరి 26 గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా అదనపు కలెక్టర్ (రెవిన్యూ) బి.ఎస్. లత.
జగిత్యాల జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జనవరి 26 గణతంత్ర దినోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లను జిల్లా అదనపు కలెక్టర్ (రెవిన్యూ) బి.ఎస్. లత పరిశీలించారు.
వేదిక నిర్మాణం, పతాకావిష్కరణ స్థలం, సాంస్కృతిక కార్యక్రమాల ప్రాంగణం, స్టాల్స్, పార్కింగ్, భద్రతా చర్యలు వంటి అంశాలను ప్రత్యక్షంగా సమీక్షించారు.
జిల్లావ్యాప్తంగా జరిగే కార్యక్రమాలకు తగినట్లుగా ఏర్పాట్లు చేయాలని సంబంధిత విభాగాల అధికారులను ఆదేశించారు.
రెవెన్యూ, పోలీస్ ,డి ఆర్ డి ఓ మరియు మున్సిపల్ సంబంధిత అధికారులతో సమన్వయం పెంచుతూ భద్రతా బందోబస్తును, ఏర్పాట్లను ఘనంగా నిర్వహించాలని సూచించారు.
ఆహ్వానితులకు, విద్యార్థులకు మరియు ప్రజలకు అవసరమైన నీటి సదుపాయాలు, వైద్య సిబ్బంది, శానిటేషన్ వ్యవస్థలను ఏర్పాటుచేయాలని ఆదేశించారు.
పేర్కొన్నారు.
పతాకావిష్కరణ అనంతరం జరిగే అట్టహాసపూరిత పరేడ్, సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాట్లను పరిశీలించారు.
విధుల్లో ఎటువంటి నిర్లక్ష్యం చోటు చేసుకోకుండా అధికారులు కట్టుదిట్టంగా పర్యవేక్షించాలని ఆమె సూచించారు.
ప్రభుత్వ గౌరవాన్ని నిలబెట్టేలా అన్ని ఏర్పాట్లు నాణ్యతతో చేయాలని అన్నారు.
జిల్లా ప్రజలంతా గణతంత్ర దినోత్సవాన్ని గౌరవంగా, దేశభక్తి వాతావరణంలో జరుపుకోవాలని ఆహ్వానించారు.
ఈ పరిశీలనలో ఆర్డీవో మధు సూదన్, డిఆర్డిఏ రఘువరన్ డిపిఆర్వో నరేష్, మున్సిపల్ కమిషనర్ స్పందన, కలెక్టరేట్ ఏ.వో హకీం, ఎపిడి సునీత, ఎమ్మార్వో రామ్మోహన్, రెవిన్యూ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, డిఆర్డిఎ సిబ్బంది, పోలీస్ శాఖ సిబ్బంది, సంబంధిత అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.