తేది:23- 01-2026 మెదక్ జిల్లా TSLAWNEWS అల్లాదుర్గం మండల్ రిపోర్టర్ వి పాపయ్య చారి.
మెదక్ జిల్లా: విద్యార్థులు ప్రణాళిక బద్దంగా చదివితే మంచి ఫలితాలు వస్తాయని కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ తుకారం అన్నారు. అల్లాదుర్గం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ బోర్డ్ ఆదేశాల మేరకు శుక్రవారం మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఇన్చార్జి ప్రిన్సిపాల్ మాట్లాడుతూ రాబోయే వార్షిక పరీక్షలు లో ప్రతి విద్యార్థి మంచి మార్కులతో ఉత్తీర్ణత పొందాలని, చదువులు ప్రణాళిక బద్ధంగా చదివితే మంచి ఫలితాలు వస్తాయని సూచించారు. విద్యార్థుల తల్లిదండ్రులు ప్రతిరోజు పిల్లలను ఉదయమే నిద్రలేపి చదువుకునేలా ప్రోత్సహించాలని కోరారు. వివిధ ప్రభుత్వ ఉద్యోగాలలో, ఉన్నత స్థాయిలో స్థిరపడిన కళాశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థుల ను కళాశాల తరుపున ఘనంగా సన్మానించారు. వారు ఎదిగిన సక్సెస్ విషయాలను కళాశాల విద్యార్థులకు వారి మాటలలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో స్టూడెంట్స్ కౌన్సిలర్ నర్సింహారెడ్డి,, శ్యామ్ రావు , రవీందర్ ,శివకుమార్, రవికుమార్, దత్తు, శంకర్, ప్రవీణ్, వివిధ హోదాలో స్థిరపడిన పూర్వ విద్యార్థులు కే బ్రహ్మం, రాయపల్లి వీరప్ప, బాలరాజ్, అనిత, పవిత్ర ,గణేష్, పాండు తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.