తేది:23- 01- 2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.
జగిత్యాల జిల్లా: జగిత్యాల జిల్లాలో పీఎం శ్రీ క్రింద ఎంపికైన 20 పాఠశాలకు సంబంధించి మంజూరైన నిధులు ఆయా పనులకు ఖర్చు చేసి వెంటనే పనులు పూర్తి చేయాలని హెచ్ఎం లను ఆదేశించారు.
శుక్రవారం రోజు కలెక్టరేట్లో జరిగిన పీఎం శ్రీ క్రింద ఎంపికైన 20 పాఠశాల కు సంబంధించిన హెచ్ఎం లతో అదనపు కలెక్టర్ రివ్యూ నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ రెవెన్యూ బి.ఎస్ లత మాట్లాడుతూ:
పి ఎం శ్రీ క్రింద ఎంపికైన పాఠశాలకు మొదట మంజూరైన నిధులను ఆయా పనులకు సకాలంలో ఖర్చు చేసి పనులను నాణ్యతగా పూర్తి చేయాలని సూచించారు ఈ పనులు పూర్తి చేస్తే వెంటనే మరో విడత నిధులు వచ్చే అవకాశం ఉందని అందువల్ల మంజూరైన పనులను తొందరగా పూర్తయ్యే విధంగా సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకొని పనులను సకాలంలో నాణ్యతతో పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో డిఈఓ రాము డి టి ఓ సోఫియా సంబంధిత పాఠశాలల హెచ్ఎంలు మరియు తదితరులు పాల్గొన్నారు.