తేది:23-01-26 TSLAWNEWS జగిత్యాల రూరల్ రిపోర్టర్
జి తిరుపతి.
జగిత్యాల జిల్లా :జగిత్యాల కొత్త బస్టాండ్ వెళ్లాలంటే ముక్కు మూసుకొని వెళ్లాల్సిందే జనంతో కాదు చెత్తతో నిండిపోతుంది. శ్రీరామ్ లాడ్జి ఎదురుగా కొత్త బస్టాండ్ ఇన్ గెట్ నుండి వెళ్లాలంటే ప్రయాణికులు ముక్కు మూసుకొని వెళ్లాల్సి వస్తుంది. పేరుకుపోఇన చెత్తతో ప్రయాణికులు వాపోతున్నారు. అలాగే చెత్తలో పందులు నివాసంతో రోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మున్సిపల్ అధికారులు చెత్తను తొలగించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే దీనిని ఆనుకొని కార్ యూనియన్ అడ్డ కూడా ఉంది, చెత్తను సేకరించడం లేదని వాపోతున్నారు. దీనిని శుభ్రం చేసి శానిటైజర్ కూడా చేయాలని యూనియన్ నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు.