తేది:23-01-26 TSLAWNEWS జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లిపూర్ రిపోర్టర్ అనుమల్ల రాజ్ కుమార్
జగిత్యాల జిల్లా: రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామ నాయకులు సామల్ల వేణు శుక్రవారం రోజున జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ను కలిసి ఇటిక్యాల గ్రామానికి కోరుట్ల డిపో నుండి బస్సు నడిచేలా అధికారులతో మాట్లాడాలని కోరగానే వెంటనే కోరుట్ల డిపో మేనేజర్ కు ఫోన్ చేసి సమ్మక్క సారక్క జాతర అయిపోగానే ఇటిక్యాల గ్రామానికి నైట్ హాల్ట్ బస్సు నడపాలని చెప్పారు. వెంటనే స్పందించినందుకు ఎమ్మెల్యే సంజయ్ కుమార్, డిపో మేనేజర్ లకు గ్రామం తరపున ధన్యవాదములు తెలిపారు.