తేది:23- 01- 2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.
జగిత్యాల జిల్లా: ఇందిరమ్మ ఇండ్ల పురోగతి పై అధికారులతో సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ జిల్లాలో మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్ల 100% గ్రౌండ్ చేయాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అన్నారు.
శుక్రవారం జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ సమీకృత జిల్లా కలెక్టరేట్ లో ఇందిరమ్మ ఇండ్ల పురోగతి పై సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ:
మార్క్ ఔట్ చేయని ఇందిరమ్మ ఇండ్ల పట్టణ మరియు రూరల్ ప్రాంతాల్లో కలిపి మొత్తం జిల్లాలో 11079 ఇండ్లు పెండింగ్ లో ఉన్నాయని, మార్చి 31 నాటికి ఈ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ముగ్గు పోసి పనులు ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు మార్క్ ఔట్ చేయని పక్షంలో వాటిని రద్దు చేసేందుకు ప్రతిపాదనలు పంపాలని అన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభించి త్వరగా బేస్మెంట్ వరకు పనులు జరిగేలా పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఎంపీడీవోలు, సంబంధిత అధికారులతో సమన్వయంతో పని చేసి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
ఇందిరమ్మ ఇండ్లకు స్వచ్ఛ భారత్ మిషన్ కింద వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు చేయాలని అన్నారు.
మరో విడత ఇందిరమ్మ ఇండ్ల మంజూరు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో మండలంలో వివిధ స్టేజీ లలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లు మార్చి నాటికీ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఇండ్ల నిర్మాణానికి నిధులు లేని పక్షంలో మహిళా సంఘాల ద్వారా స్వయం సహాయక రుణాలు అందజేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేయాలని అన్నారు. లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపులు ఆలస్యం జరగకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్, జగిత్యాల ఆర్డీవో మధు సూదన్, హౌసింగ్ పిడి ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ లు, ఎంపిడివోలు, క్లస్టర్ ఇంచార్జి లు, సంబంధిత అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.