తేది:23-01-2026 TSLAWNEWS హైదరాబాద్ ఇంచార్జ్ విజయ్ మురళీకృష్ణ.
హైదరాబాద్, కుత్బుల్లాపూర్ : పట్టపగలే కత్తులతో ఒకరి పై ఒకరు దాడి.గుండ్లపోచం పల్లి మునిసిపల్ పరిధి మైసమ్మ గూడ లో పట్ట పగలే అందరూ చూస్తుండగా కత్తి తో దాడి.
పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి,మైసమ్మ గూడ లో శంకరయ్య(55) పై కత్తితో దాడి చేసిన రవి అనే వ్యక్తి.
ఆర్థిక లావాదేవీల విషయంలో రవి మహేష్ మధ్య గొడవ.
అడ్డుకోబోయిన మహేష్ కు వరసకు (బాబాయి)అయిన శంకరయ్య పై కత్తితో దాడి చేసిన రవి .తీవ్ర గాయాల పాలైన శంకరయ్యను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలింపు పరిస్థితి విషమం.కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పేట్ బషీరాబాద్ పోలీసులు.