NTR31 ప్రాజెక్టు అప్‌డేట్ ఇచ్చారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఇప్పటి వరకు తాను తీసిన చిత్రాలకు అది విభిన్నంగా ఉంటుందని తెలిపారు. కానీ, ఆ కథ ఏ నేపథ్యంలో సాగుతుందనేది చెప్పేందుకు నిరాకరించారు. ప్రేక్షకులు యాక్షన్ చిత్రమని భావిస్తున్నారని, జానర్ ఏదైనా ఫ్యాన్స్ కి బాగా కనెక్ట్ అవుతుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో చిత్రీకరణ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు.