అరైవ్_ఎలైవ్ రోడ్డు భద్రత అవగాహన:డిఎస్పీ శ్రీనివాసరావు.

తేది:22-01-2026 నల్లగొండ జిల్లా TSLAWNEWS దేవరకొండ నియోజకవర్గం పులిజాల గోవర్ధన్.

నల్గొండ జిల్లా: నేరడుగొమ్ము మండల కేంద్రంలో ఉన్న ఆదర్శ పాఠశాలలో డిఎస్పీ శ్రీనివాసరావు, నేరడుగొమ్ము ఎస్ఐ నాగేంద్ర బాబు ఆధ్వర్యంలో అరైవ్ … ఎలైవ్,జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా డిఎస్పి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను నివారించడానికి తల్లిదండ్రులు మైనర్ పిల్లలకు బైకులు ఇవ్వొద్దన్నారు,ఒకవేళ మైనర్ బైక్ నడిపి ప్రమాదం చేస్తే తల్లిదండ్రులు కూడా శిక్షకు అర్హులన్నారు.మనం చేసే తప్పిదం వల్ల ఎదుటివారు బలయ్యే అవకాశం ఉందన్నారు.
విద్యార్థులు మీ తల్లిదండ్రులకి,మీ బంధువులకి మద్యం సేవించి వాహనం నడపరాదని అవగాహన కల్పించాలన్నారు,ఆ యొక్క బాధ్యత విద్యార్థుల పైన ఉందని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తును ఉద్దేశించి మాట్లాడుతూ మీరు మంచిగా మీ యొక్క లక్ష్యాన్ని చేరుకోవాలంటే ముందు మీరు బైక్ లకు, మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండాలని సూచించారు. ధర్మో రక్షతి రక్షితః ధర్మాన్ని మనం కాపాడితే మనల్ని ధర్మం కాపాడుతుందన్న విధంగా విద్యో రక్షతి రక్షితః అంటే చదువుని మనం కాపాడితే చదువు మనల్ని కాపాడి ఉన్నత శిఖరాలకు చేరుతుందని అన్నారు. మున్ముందు రోడ్డు ప్రమాదాల నివారణకు కఠిన చట్టాలు వస్తాయని తెలిపారు.సురక్షితంగా గమ్యం చేరడం లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం,రాష్ట్ర పోలీస్ శాఖ డిజిపి అరైవ్ అలైవ్ అనే రోడ్డు భద్రత మహా ఉద్యమం కార్యక్రమం ప్రారంభించారని అన్నారు.ప్రతి సంవత్సరం జనవరి నెలలో ప్రభుత్వం ఆధ్వర్యంలో జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు.ఈ కార్యక్రమం ద్వారా పోలీసు శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత పట్ల విద్యార్థులకు, వాహనదారులకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాం.వాహన దారుల నిర్లక్ష్యం వల్లనే అధిక ప్రమాదాలు సంభవిస్తున్నవి అని తెలిపారు.ప్రయాణ సమయంలో ముందస్తు జాగ్రత్తలు పాటించడం ద్వారా ప్రమాదాలను అరికట్టవచ్చని సూచించారు.ప్రయాణ సమయంలో ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమ నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.ద్విచక్ర వాహనంపై ప్రయాణించేవారు హెల్మెట్ తప్పక ధరించాలి,కారు, పెద్ద వాహనాల్లో ప్రయాణించేవారు సీట్ బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలి,మద్యం తాగి వాహనాలు నడపవద్దు, రోడ్లపై ఎక్కడపడితే అక్కడ వాహనాలు నిలపవద్దు,తప్పుడు మార్గంలో వాహనాలు నడపవద్దు,వాహనాలకు అన్ని అనుమతి పత్రాలు కలిగి ఉండాలి లైసెన్స్ కలిగి ఉండాలి అని కోరారు.తల్లిదండ్రులు పిల్లలకు వాహనాలు ఇవ్వవద్దు అని కోరారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్,సిబ్బంది కలిసి డిఎస్పీ ని శాలువాతో సత్కరించారు.ఈ యొక్క కార్యక్రమంలో డిఎస్పీ శ్రీనివాస రావు, ఎస్ఐ నాగేంద్ర బాబు,ప్రిన్సిపాల్ కొర్ర శిరీష,వైస్ ప్రిన్సిపల్ అజ్మీర కోటేష్ నాయక్, ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు,పోలీసు సిబ్బంది,విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *