తేది:22- 01-2026 మెదక్ జిల్లా TSLAWNEWS అల్లాదుర్గం మండల్ రిపోర్టర్ వి పాపయ్య చారి.
మెదక్ జిల్లా: మండల పరిధిలోని చిల్వర్ జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో జనవరి 26 స్వాతంత్ర దినోత్సవం ను పురస్కరించుకొని పాఠశాలలో విద్యార్థిని, విద్యార్థులకు ఆటల పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆటల పోటీలలో చురుకుగా పాల్గొన్నారు. ఈ పోటీలు హోరాహోరీగా కొనసాగాయి. ఈ పోటీలు మూడు రోజులపాటు నిర్వహించనున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సరిత తెలిపారు. విద్యార్థులకు కబడ్డీ కోకో ,వాలీబాల్ ,రన్నింగ్ తదితర పోటీలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పీఈటి సత్యనారాయణ గౌడ్ ఉపాధ్యాయ బృందం విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.