గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలి – అదనపు కలెక్టర్ (రెవిన్యూ) బి. ఎస్.లత.

తేది:22- 01- 2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.

జగిత్యాల జిల్లా: జగిత్యాల జిల్లాలో నిర్వహించనున్న గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ (రెవిన్యూ) బి.ఎస్. లత సంబంధిత జిల్లా అధికారులను ఆదేశించారు.
గురువారం జగిత్యాల జిల్లా సమీకృత కలెక్టరేట్ లో గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ (రెవిన్యూ) బి.ఎస్. లత మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ వేడుకలు జిల్లాలోని ప్రతి శాఖకు చెందిన అధికారులు , సిబ్బంది వేడుకలకు తప్పనిసరిగా హాజరు కావాలని అదనపు కలెక్టర్ తెలిపారు.
గణతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి జాతీయ పతాక ఆవిష్కరణ ఏర్పాట్లు, గ్రౌండ్ సిద్దం చేయడం మొదలగు ఏర్పాట్లు పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు సమన్వయంతో పూర్తి చేయాలని అన్నారు. గణతంత్ర వేడుకల డయాస్ ,సీటింగ్ ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రోటోకాల్ ప్రకారం సీటింగ్ ఏర్పాట్లు చేయాలని, దీనిని అప్రమత్తంగా నిర్వహించాలని అన్నారు.
వైద్య బృందాలచే శిభిరాలు ఏర్పాటు చేయాలని అన్నారు. జిల్లా కలెక్టర్ జిల్లా ప్రజలనుద్దేశించి చేసే ప్రగతి సందేశం రూపొందించేందుకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల వివరాలను క్లుప్తంగా అందజేయాలని అన్నారు.
గణతంత్ర వేడుకల అవసరమైన మేర త్రాగు నీటి ఆర్.డబ్ల్యూ.ఎస్ అధికారులు మున్సిపల్ కమిషనర్ సమన్వయంతో ఏర్పాటు చేయాలని అదనపు కలెక్టర్ తెలిపారు.
గణతంత్ర దినోత్సవ వేడుకలలో సాంస్కృతిక కార్యక్రమాల కోసం పాఠశాల విద్యార్థులను తరలించే సమయంలో అప్రమత్తంగా ఉండాలని వారికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ విద్యాశాఖ అధికారికి సూచించారు.
వివిధ శాఖల స్టాల్స్ ఏర్పాటు చేసే విధంగా డిఆర్డిఓ సమన్వయం చేసుకోవాలని తెలిపారు.
గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు స్థానిక ఆర్డిఓ ఆర్డీవో,తాసిల్దార్ మరియు మున్సిపల్ కమిషనర్లు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో జగిత్యాల రెవిన్యూ డివిజనల్ అధికారి మధు సుధన్, కలెక్టరేట్ పరిపాలన అధికారి, ఆర్ డి ఓ రఘువరన్, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు సంబంధిత అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *