
తేది: 21-01-2026 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS సదాశివపేట మండలం క్రైమ్ రిపోర్టర్ బి. ప్రసాద్ గౌడ్.
సంగారెడ్డి జిల్లా:బుధవారం రోజున సదాశివపేట మండలం నుండి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు ఆత్మకూర్, బాబిల్ గాన్, కోనాపూర్, పెద్దాపూర్ మరియు ఏఎంఎస్ ఉన్నత పాఠశాలల హెచ్.ఎంలు, టీచర్స్ మరియు విద్యార్థులు దక్షిణ భారత వైజ్ఞానిక ప్రదర్శన-2026ను సందర్శించడం జరిగిందని మండల విద్యాధికారి ఎన్.శంకర్ తెలిపారు.
కొల్లూరు గాడియం క్యాంపస్ లోని ఇంటర్నేషనల్ స్కూల్ లో ఈనెల 19 నుండి 23 వరకు నిర్వహిస్తున్నసౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్-2026 లో ఏర్పాటు చేసిన స్టాళ్లు వినూత్న ఆలోచనలతో, శాస్త్రీయ దృష్టి కోణంతోరూపొందించబడ్డాయని,విద్యార్థుల సృజనాత్మకతకు, ఆవిష్కరణలకు,ప్రతిభకు ఈ సైన్స్ ఫెయిర్ అద్భుత వేదిక అని, ఈ సైన్స్ ఫెయిర్ లో వివిధ కార్యక్రమాలు, సింపోజియం,చర్చా వేదికలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయని, విద్యార్థులు ప్రదర్శించిన ప్రయోగాలు,నమూనాలు, ఆవిష్కరణల ద్వారా విద్యార్థులు శాస్త్ర సాంకేతికతపై అవగాహన పెంచుకునేందుకు ఉపయోగపడతాయని మండల విద్యాధికారి ఎన్.శంకర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో సదాశివపేట మండలంలోని పాఠశాలల హెచ్.ఎంలు నాగభూషణం,కృష్ణయ్య, రామ్ నర్సింహారెడ్డి, రామకృష్ణ,టీచర్స్,ఎంఆర్సిస్టాప్,సిఆర్పిలు మరియు విద్యార్థులు పాల్గొన్నారని మండల విద్యాధికారి ఎన్.శంకర్ తెలిపారు.