తేది :21-01-2026 నల్లగొండ జిల్లా TSLAWNEWS దేవరకొండ నియోజకవర్గం పులిజాల గోవర్ధన్
నల్గొండ జిల్లా: దేవరకొండ నియోజకవర్గం డిండిమండలంలో బీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది.ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ సమక్షంలో పలువురు కీలక నాయకులు,కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కందుకూరు గ్రామం నుండి శాంతిగూడెం సర్పంచ్, డిండి మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు చింతలపూడి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీకి చెందిన శ్రీకాంత్, వెంకటేష్,లక్ష్మణ్,కిరణ్, కిషోర్,అఖిల్,మధు, వెంకటయ్య,సంతోష్, రాజు,సంజయ్ తదితరులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.నిజాం నగర్ గ్రామం నుండి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ వింజమూరు శేఖర్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ ఉప సర్పంచ్ నల్లవెల్లి వెంకటయ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ కార్యక్రమంలో దేవరకొండ మాజీ జెడ్పిటిసి అరుణ సురేష్ గౌడ్,మాజీ ఎంపీపీ బిక్కు నాయక్,మాజీ వైస్ ఎంపీపీ పాప నాయక్, పెద్దగట్టు సర్పంచ్ నారాయణ,యూత్ కాంగ్రెస్ నియోజకవర్గం అధ్యక్షుడు కిన్నెర హరిక్రిష్ణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు లట్టుపల్లి శేఖర్ రెడ్డి, కోటయ్య,వెంకటయ్య, సంజీవ,రాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.