విద్యుత్ షాక్‌తో నష్టపోయిన కుటుంబానికి ఎమ్మెల్యే బాలు నాయక్ భరోసా.

తేది :21-01-2026 నల్లగొండ జిల్లా TSLAWNEWS దేవరకొండ నియోజకవర్గం పులిజాల గోవర్ధన్.

నల్గొండ జిల్లా: దేవరకొండ పట్టణంలోని గాంధీనగర్‌లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా సర్వం కోల్పోయిన పున్న అలివేలు కుటుంబాన్ని దేవరకొండ శాసనసభ్యులు నేనావత్ బాలు నాయక్ పరామర్శించారు.ప్రమాదం జరిగిన తీరును,దెబ్బతిన్న ఇంటి సామాగ్రిని ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించారు. అగ్ని ప్రమాదంలో నష్టపోయిన కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. బాధితులను ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా ఆదుకుంటామని,తగిన పరిహారం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో దేవరకొండ మాజీ సర్పంచ్ పున్న వెంకటేశ్వర్లు,యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు కిన్నెర హరికృష్ణ,మాజీ జడ్పీటీసీ రేణుక,కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *