రాష్ట్రాన్ని ప్రపంచంతో పోటీ పడేలా చేసే శక్తి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది – జగిత్యాల జిల్లా ధర్మపురి బహిరంగ సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు.

తేది:21- 01- 2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.

జగిత్యాల జిల్లా: రాష్ట్రాన్ని ప్రపంచంతో పోటీ పడేలా చేసే శక్తి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది అని జగిత్యాల జిల్లా ధర్మపురి బహిరంగ సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు.
గతంలో పాలన అంటే దోచుకోవడం పంచుకోవడం ఇప్పుడు సంపద పోగు చేసి ప్రజలకు పంచడమే లక్ష్యం అని అన్నారు.
సమాజం ఉమ్మడి కుటుంబం లా ఎదగాలి అన్న ఆలోచనతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నాం అని తెలిపారు.
గత పాలకులు వ్యవసాయం దండుగా అంటే మేం పండుగ చేస్తున్నాం కేవలం రైతుల కోసం లక్ష కోట్లు ఖర్చు చేశాం అన్నారు.
సంక్షేమం పరమావధిగా పనిచేస్తున్న ప్రభుత్వం మాది అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *