తేది: 20-01-2026 TSLAWNEWS జగిత్యాల్ జిల్లా, మల్యాల మండలం, రిపోర్టర్ కుందారపు రమేష్.
జగిత్యాల జిల్లా: మల్యాల మండలం కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనానికి వచ్చిన ఓ మహిళతో పాటు, వారి కుటుంబ సభ్యులను కొందరు వ్యక్తులు బెదిరించడంతో వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నరేష్ తెలిపారు. సారంగాపూర్ కు చెందిన దండుగుల లక్ష్మి ఆంజనేయస్వామి దర్శనానంతరం తన కుటుంబసభ్యులతో కలిసి కొండగట్టు దిగువ ప్రాంతాన భోజనం చేస్తున్న క్రమంలో, అక్కడే ఉన్న భగత్ అనే వ్యక్తితో పాటు మరో నలుగురు వ్యక్తులు మద్యం సేవించి వచ్చి దుర్భషలాడి, చంపుతానని బెదిరించినట్లు సదర్ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.