ఈ రోడ్డు పూర్తయ్యేదెప్పుడు..?

తేది:21-01-2026 TSLAWNEWS జగిత్యాల్ జిల్లా, మల్యాల మండలం, రిపోర్టర్ కుందారపు రమేష్.

జగిత్యాల జిల్లా: మల్యాల మండల కేంద్రంలోని బ్లాక్ చౌరస్తా నుంచి బైపాస్ మీదుగా పెగడపల్లి వెళ్లే రోడ్డు విస్తరణ పనులను ప్రారంభించి 3 ఏళ్ళు గడిచిన ఇంకా పూర్తి కాకపోవడంపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సుమారు 5 కిలోమీటర్ల పైన అర్ధాంతరంగా అలాగే వదిలేయడంతో కంకర రాళ్లు పైకి లేచి ప్రమాదాలు సంభవిస్తున్నాయని, నిత్యం ఈ రోడ్డు వెంట వెళ్లాలంటే దుమ్ము, ధూళితో నరకం అనుభవిస్తున్నామని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు ఇప్పటికైనా స్పందించి రోడ్డును వెంటనే పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *