తేది:21-01-2026 జగిత్యాల జిల్లా TSLAWNEWS
రాయికల్ మండలo రిపోర్టర్ కాశిరెడ్డి నాగరాజు.
జగిత్యాల జిల్లా: రాయికల్ పట్టణంలో బస్టాండ్ పరిస్థితి అధ్వానంగా తయారైంది.గ్రామ పంచాయతీ నుండి మున్సిపల్ గా మారిన మారని బస్టాండ్ ఏళ్లు గడుస్తున్నా, పాలకులు మారుతున్నా బస్టాండ్కు మోక్షం కలగడం లేదు. కనీస సౌకర్యాలు లేక ప్రయాణికులు ఎండకు ఎండి, వానకు తడుస్తూ బస్సుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. నిలువ నీడ లేక సమీపంలోని దుకాణాల ముందు పడిగాపులు కాస్తున్నారు. 5 బస్సులు ఒకేసారి రావడంతో బస్టాండ్ ఆవరణలో తీవ్ర రద్దీ ఏర్పడి ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.