గుడుంబా స్థావరాలపై దాడి చేసిన ఎక్సైజ్ శాఖ అధికారులు.

తేది:20- 01-2026 జగిత్యాల జిల్లా TSLAWNEWS
రాయికల్ మండలం రిపోర్టర్ కాశిరెడ్డి నాగరాజు.

జగిత్యాల జిల్లా: రాయికల్ మండలం లో ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ ఆదేశాల మేరకు రాయికల్ మండలం రాజనగర్ గ్రామంలో మంగళవారం కరీంనగర్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గుడుంబా స్థావరాలపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 1100 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. నాటు సారాను తయారుచేసినా, విక్రయించినా, రవాణా చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సీఐ నరేందర్ రెడ్డి, ఎస్సై మజీద్ ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *