తేది:20-01-2026 TSLAWNEWS మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తోట అభిలాష్.
మెదక్ జిల్లా : జిల్లా పోలీస్ విభాగంలో విధి నిర్వహణలో అంకితభావంతో, ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులను ప్రోత్సహించే ఉద్దేశంతో జిల్లా వ్యాప్తంగా ఎంపికైన సిబ్బందికి జిల్లా ఎస్పీ గారు ప్రశంస పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ, ప్రజల భద్రతే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని, కష్టపడి విధులు నిర్వహిస్తూ శాంతి భద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న సిబ్బంది సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. ఉత్తమ సేవల ద్వారా పోలీస్ శాఖపై ప్రజల్లో నమ్మకం మరింత పెరుగుతుందని తెలిపారు.
కార్యక్రమంలో మెదక్ జిల్లా అదనపు ఎస్పీ శ్రీ ఎస్. మహేందర్, డీఎస్పీలు, సీఐలు, జిల్లా ఎస్‌ఐలు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొని, ప్రశంసలు పొందిన సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమం ఇతర సిబ్బందికి కూడా మరింత ఉత్సాహం, ప్రేరణ కలిగించేలా నిలిచింది.