తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. దీంతో రాష్ట్రానికి రెండో సీఎంగా ఇవాళ రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నేడు మధ్యాహ్నం 1. 04 గంటలకు ఎల్బీ స్టేడియంలో ప్రమాణస్వీకారం జరుగనుంది. గవర్నర్ తమిళిసై రేవంత్ రెడ్డితో ప్రమాణం చేయించనున్నారు. రేవంత్‌తో పాటు ఒక డిప్యూటీ సీఎం, ఐదుగురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాణస్వీకారానికి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీలతో పాటు కేసీ వేణుగోపాల్, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, డీకే శివకుమార్, మాణిక్ రావు థాక్రే హాజరుకానున్నారు.