
తేది:20-01-2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా కో ఆర్డినేటర్ రాచమల్ల సుభాష్.
జగిత్యాల జిల్లా: జగిత్యాల మున్సిపాలిటీ పాతబస్టాండ్ లోనే ఇన్ని సమస్యలు ఉంటే జగిత్యాల పట్టణం లో ఇంకెన్ని సమస్యలో అని ముచ్చటిస్తున్న జగిత్యాలకు రోజు వచ్చి పోయే ప్రజలు. రోడ్డుకు ఇరు వైపుల ఉన్న షాపు యజమానులు జగిత్యాల మున్సిపల్ పని తిరును ప్రశ్నిస్తున్నారు. రోజు రద్దిగా ఉండే పాత బస్టాండ్ పరిసరాలను గమనిస్తే తెలుస్తుంది. జగిత్యాలలో మున్సిపల్ ఆఫీస్ కు కూత వేటు దూరంలో ఉన్న గొల్లపల్లి రోడ్డులో ఏర్పాటు చేసిన పబ్లిక్ టాయిలెట్ చుస్తే తెలుస్తుంది. మున్సిపల్ వారు మూత్రశాలలు ఏర్పాటు చేశారు కానీ వాటికి వెళ్లే దారికి అడ్డంగా రెండుపెద్ద పెద్ద పైపులు వేశారు. వాటిని తొలిగించకుండ అధికారులు చొద్యం చూస్తున్నట్టుగా ఉంది. మూత్రశాలకు వెళ్ళాలి అంటే దారి లేదు వాటి ముందునుండి పెద్ద మురికి కాలువ ఉంది దానిపైన కప్పు వేయలేదు కాలు జారీ అందులో పడితే అంతే… కాలో చేయొ విరగడం కాయం. మూత్రానికి వెళ్లాలంటేనే భయం వేస్తున్నదని అంటున్నారు. ఇంకా చెప్పాలంటే వృద్దులకు వెళ్ళడానికి కష్టంగా ఉంది. ఎమర్జెన్సిగా ముత్రానికి వెళ్లాలంటే భయమేస్తుంది అని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి పైపులను తొలగించి డ్రైనేజి పైన కప్పు ఏర్పాటు చేయాలని జగిత్యాల పట్టణ పౌరులు కోరుచున్నారు.