తేది:20-01-2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా
ఇబ్రహీంపట్నం మండల రిపోర్టర్ రాడే శ్రీనివాస్.
జగిత్యాల జిల్లా : పసుపు రైతులు మార్కెట్‌కు పచ్చి పసుపును తీసుకురావద్దని, అలా చేస్తే ఆర్థికంగా నష్టపోతారని నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి సూచించారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం డబ్బా గ్రామంలో రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు.బాగా ఎండిన, శుభ్రం చేసిన పసుపును తెస్తేనే వ్యాపారుల మధ్య పోటీ పెరిగి గిట్టుబాటు ధర లభిస్తుందని తెలిపారు. పచ్చి పసుపునకు లాట్ నంబర్లు ఇవ్వబడదాని , దానికి త్వరగా ఫంగస్ (బూజు) సోకి నాణ్యత దెబ్బతింటుందని హెచ్చరించారు. రైతులు లాట్ నంబర్ తీసుకునేటప్పుడు మొబైల్ నంబర్ నమోదు చేయాలని, విక్రయం తర్వాత ‘ఇనామ్’ ద్వారా ఆన్‌లైన్ బిల్లు పొంది వెంటనే నగదు సరిచూసుకోవాలి
ముఖ్యాంశాలు: పచ్చి పసుపు విక్రయానికి అనుమతి లేదు.ఎండిన పసుపునకు అధిక ధర, పచ్చి పసుపుకు ఫంగస్ పట్టే ప్రమాదం ఉందనీ తెలిపారు.ఈ కార్యక్రమంలో దేశెట్టి జీవన్ మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు