జగిత్యాలలో 235 కోట్లతో 450 పడకల ఆసుపత్రికి ఈ రోజు భూమి పూజ చేయనున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ – స్టల పరిశీలన చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్.

తేది:20- 01-2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.

జగిత్యాల జిల్లా: పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం 23.5 కోట్లతో క్రిటికల్ కేర్ యూనిట్,3 కోట్లతో సెంట్రల్ మెడిసిన్ స్టోర్ ప్రారంభోత్సవం, జగిత్యాల జిల్లా కేంద్రంలో మాతా శిశు,మెడికల్ కాలేజీ దగ్గర 235 కోట్లతో నిర్మించనున్న నూతన ఆసుపత్రి భూమిపూజ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారి సభ ఏర్పాట్లకు స్టల పరిశీలన చేసి,సభను విజయవంతం చేయాలని ప్రజలను మీడియా ద్వారా కోరారు జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్.అనంతరం ప్రారంభం కానున్న క్రిటికల్ కేర్ యూనిట్ ,సెంట్రల్ మెడిసిన్ స్టోర్ ల ఎమ్మెల్యే పర్యవేక్షించారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ : జగిత్యాల జిల్లా పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుబాటులోకి రానుందని అన్నారు.
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారికి క్రిటికల్ కేర్ ఏర్పాటు తో అత్యవసర వైద్యం అందుబాటులోకి వస్తుంది.
క్రిటికల్ కేర్ మరియు నూతన ఆసుపత్రితో 20 మండలాలు ఐదు మున్సిపాలిటీలకు ఉపయోగం.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైద్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ జిల్లా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గార్ల సహకారంతో జిల్లా కేంద్రంలో విద్యా వైద్యానికి అత్యధిక మంజూరు.
క్రిటికల్ కేర్ ప్రారంభం తో డయాలసిస్,అత్యవసర ప్రసూతి శస్త్ర చికిత్సలు,3 ఆపరేషన్ థియేటర్ లు అందుబాటు లోకి వస్తాయి. జగిత్యాల నిరంతర అభివృద్ధి కోసం కృషి చేస్తా
చల్గల్ వాలంటరీ క్షేత్రంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్ మినీ స్టేడియం కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు కానున్నాయి
నియోజకవర్గ అభివృద్ధికి వందల కోట్లు నిధులు మంజూరు చేస్తున్న ముఖ్యమంత్రి గారికి మంత్రులకు జగిత్యాల ప్రజలకు రక్షణ ప్రత్యేక ధన్యవాదాలు.సీనియర్ నాయకులు వారి స్తాయి దిగజారి మాట్లాడడం మానుకోవాలి.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సునీల్,సూపరిండెంట్ కృష్ణ మూర్తి, EE విశ్వ ప్రసాద్,de రాజారెడ్డి, RMO లుడా.శ్రీపత్ ,డా.నరేష్,డా.గీతిక,డా.స్వరూప,నాయకులు సందీప్ రావు మాజీ పాక్స్ ఛైర్మెన్, నోముల శేఖర్ రెడ్డి,మతులపురం శేఖర్,నాగుల శ్రీనివాస్,వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *