
తేది:19-01-2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.
జగిత్యాల జిల్లా: సోమవారం జగిత్యాల జిల్లాలో నూతనంగా ఎన్నికైన సర్పంచులకు న్యాక్ సెంటర్ (నూకపల్లి, జగిత్యాల) యందు 5 రోజుల శిక్షణ కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ ఆద్వర్యంలో ఏర్పాటు చేయగా శిక్షణ తరగతులకు హాజరై జెడ్పి సిఈవో గౌతమ్ రెడ్డి సర్పంచులను ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ సందర్భంగా జెడ్పి సిఈవో గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ:
శిక్షణ కార్యక్రమాలకు పూర్తి స్థాయిలో హాజరయ్యి శిక్షణ పొందిన నిపుణుల సమక్షంలో కూలంకషంగా శిక్షణ పొందాలన్నారు. పన్నుల వసూలు, ఇతర ఆదాయ మార్గాలు, బడ్జెట్ రూప కల్పన, పంచాయతీలో పాలన వ్యవహారాలు, పారిశుధ్య నిర్వహణ, గ్రీన్ బడ్జెట్ తదితర అంశాల సంబంధించి ఐదు రోజులపాటు పూర్తిస్థాయి సర్పంచ్ లకు శిక్షణ అందించడం జరుగుతుందని అన్నారు.
మీ గ్రామాలని ఆదర్శవంతమైన గ్రామాలుగా తీర్చిదిద్దే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగేపంచాయతీ రికార్డులు, రిజిస్టర్లు, సమావేశం మినిట్స్, ఖర్చు పద్దుల వివరాలను సక్రమంగా ఉండే విధంగా పరిశీలించాలన్నారు. ప్రజలకు అన్నిరకాల మౌళిక సౌకర్యాలను అందించే విధంగా చర్యలు తీసుకొని గ్రామంలోని అన్ని వర్గాల ప్రజలను, అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకొని మీ గ్రామాన్ని ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దే విధంగా మంచి పరిపాలన అందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి మదన్ మోహన్, జిల్లా డిప్యూటీ సిఈవో పి. నరేష్, శిక్షణ జిల్లా పంచాయతీ అధికారి రేవంత్, ఎంపిడివోలు, ఎంపివోలు, టివోటిలు, సంబంధిత అధికారులు, డిపివో కార్యాలయ సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు.