ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిచౌంగ్ తుఫాన్ ఎఫెక్ట్ వల్ల టమోటా, ఉల్లిగడ్డల ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. ప్రస్తుతం టమోటా ధర 20 రూపాయలకు చేరింది. ఇది కేవలం ఆస్పరి టమోటా మార్కెట్లో మాత్రమే ఉంది. దసరా, దీపావళి పండుగల సమయంలో కిలో ఉల్లి ధర రూ.30 ఉండగా ప్రస్తుతం రూ. 80కి చేరింది. గతంలో టమోట ధరతో హడలిపోయిన ప్రజలు ప్రస్తుతం ఉల్లి ధరలతో బెంబేలెత్తుతున్నారు.