తేది:19-01-2026 ఖమ్మం జిల్లా TSLAWNEWS దేవరకొండ నియోజకవర్గం పులిజాల గోవర్ధన్.
ఖమ్మం జిల్లా: జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల పాల్వాయి 2015-16 సంవత్సరం పదవ తరగతి విద్యార్థులు,విద్యార్దునులు అలనాటి చదువునేర్పిన ఉపాధ్యాయులను ఆహ్వానం పలికి వారిని షాలువ, మెమంటో అందజేసి అలనాటి తీపి గుర్తులను గుర్తుచేసుకున్నారు. ఉపాధ్యాయులు యాదగిరి, అంకం చంద్రమౌళి, వెంకట్రాంరెడ్డి,ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి, సూర్య, శ్యామ్, పద్మాలత, విష్ణుకాంత, తదితరుల తమ అనుబందాలను, ఆప్యాయతలను గుర్తుచేసుకొని ఆనందాన్ని వ్యక్తం చేసినారు, ఈ రోజు జీవితంలో స్థిరపడ్డాము అంటే తమరి ప్రేమ, ఆధారణాల ద్వారా విద్యాబోధన చేసి జీవితంలో ఎలా మంచిగా జీవించాలో దారి చూపిన గురువులకు పాదాబి వందనాలు చేసినారు. అనంతరం అట, పాటలతో అల్లరించినారు, పసందైనా భోజనాలు ఏర్పాటుచేసినారు. ఈ కార్యక్రమంలో విద్యార్డులు శివా, నరేష్, సైదులు, సర్పంచ్, విద్యార్దునులు మొత్తం 30మంది పాలుగోన్నారు.