ఎస్‌ఐఎస్‌ఎఫ్–2026 కు అన్ని ఏర్పాట్లు పూర్తి, ఈనెల 19న ప్రారంభానికి సిద్ధమైన సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్ 2026-సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య.

తేది:18-01-2026 TSLAWNEWS సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఉమ్మన్నగారి కృష్ణాగౌడ్.

సంగారెడ్డి జిల్లా: దక్షిణ భారతదేశంలో విద్యార్థుల శాస్త్రీయ ప్రతిభను ప్రోత్సహించే ఉద్దేశంతో నిర్వహించనున్న సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్ (SISF)–2026 కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు.
ఈనెల 19 నుంచి 23 వరకు రామచంద్రపురం మండలం కొల్లూరులోని గాడియం ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాంగణంలో ఈ సైన్స్ ఫెయిర్‌ను ఘనంగా నిర్వహించనున్నట్లు ఆమె వెల్లడించారు.
దక్షిణ భారతదేశానికి చెందిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల నుంచి ఎంపికైన 210 నూతన శాస్త్రీయ ఆవిష్కరణలు ఈ సైన్స్ ఫెయిర్‌లో ప్రదర్శించ నున్నట్లు కలెక్టర్ తెలిపారు.
బాల శాస్త్రవేత్తలు తమ ప్రతిభను చాటిచెప్పేలా 210 ఎగ్జిబిట్స్ తో పాటు ఎన్ జి ఓల ద్వారా 40 సైన్స్ స్టాల్స్ ను ఏర్పాటు చేస్తున్నట్లుపేర్కొన్నారు.
నూతన ఆలోచనలు, పరిశోధనలతో రూపొందిన ఈఆవిష్కరణలు శాస్త్ర సాంకేతికతకు చేయూత
నిస్తూ, విద్యార్థుల్లో ఆవిష్కరణాత్మక ఆలోచనలను పెంపొందించేందుకు దోహదపడతాయని కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ సైన్స్ ఫెయిర్‌ను జనవరి 19న (సోమవారం) ఉదయం 10 గంటలకు రాష్ట్ర మంత్రులు,ప్రజా ప్రతినిధులు,ఉన్నత స్థాయి అధికారులు అధికారికంగా ప్రారంభించనున్నట్లు ఆమె తెలిపారు.
సైన్స్ ఫెయిర్‌ను పకడ్బందీ ఏర్పాట్లతో, భద్రత, వసతులు, సందర్శకుల సౌకర్యాల పరంగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు సందర్శకులకు ప్రవేశం కల్పించనున్నట్లు వెల్లడించారు.సైన్స్ ఫెయిర్‌ను
అధికారులు, విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు,ఉపాధ్యాయులు, బాల మేధావులు, శాస్త్ర సాంకేతిక అభిమానులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, మీడియా ప్రతినిధులు, ప్రజలు, ఆసక్తి గల ప్రతి ఒక్కరూ ప్రత్యక్షంగా తిలకించి ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *