తేది:18-01-26 TSLAWNEWS జగిత్యాల్ జిల్లా , రాయికల్ మండలం రిపోర్టర్ అనుమల్ల రాజ్ కుమార్.
రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన స్పోర్ట్స్ క్లబ్ టీం శ్రీరాంపూర్ గ్రామంలో శనివారం నిర్వహించిన ఓపెన్ వాలీబాల్ టోర్నమెంట్ పోటీలలో పాల్గొని ఆడి ప్రథమ విజేతగా నిలచి బహుమతిని అందుకున్నారు . ఈ సందర్భంగా ఆదివారం రోజున ఇటిక్యాల గ్రామ సేవా సమితి ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన స్పోర్ట్స్ క్లబ్ టీంను వాలీబాల్ టోర్నమెంట్ లో ప్రధమవిజేతలుగా నిలిచిన క్రీడాకారులను అభినందించి నగదు ప్రోత్సాహక బహుమతిని అందజేశారు. కార్యక్రమంలో గ్రామ సేవా సమితి అధ్యక్షులు అనుపురం చిన్న లింబాద్రిగౌడ్ మాట్లాడుతూ మా గ్రామ క్రీడాకారులు (స్పోర్ట్స్ క్లబ్ టీం) వాలీబాల్ టోర్నమెంట్ చాకచక్యంగా ఆడి మొదటి విజేతగా నిలిచినందుకు అభినందనలు తెలుపుతూ, క్రీడాకారులు క్రీడలలో జిల్లాస్థాయి రాష్ట్రస్థాయి జాతీయస్థాయిలో రాణించి ప్రథమ స్థాయిలో విజేతలుగా నిలిచి గ్రామానికి మంచి వన్నె తేవాలని క్రీడాకారులను కోరారు. నేటి యువత చెడువ్యసనాలకు పాల్పడకుండా విద్యా, క్రీడలలో పోటీపడుతూ విజేతలుగా నిలవాలని గ్రామయువత నుండి కోరుకుంటున్నామని చిన్న లింబాద్రి గౌడ్ అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సేవా సమితి సభ్యులు, గ్రామ నాయకులు,యువకులు, స్పోర్ట్స్ క్లబ్ సభ్యులు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు.